Karimnagar: తరగని ప్రజాభిమానం.. ఎం. సత్యనారాయణరావు 5వ వర్ధంతి
Karimnagar: కరీంనగర్ జిల్లా వెదిరలో మాజీ మంత్రి ఎం. సత్యనారాయణరావు 5వ వర్ధంతి.
Karimnagar: తరగని ప్రజాభిమానం.. ఎం. సత్యనారాయణరావు 5వ వర్ధంతి
కరీంనగర్ జిల్లా: రామడుగు మండలం వెదిర గ్రామంలో మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ ఎం. సత్యనారాయణరావు 5వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన స్మారక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఎం. సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన ప్రజాసేవలను, రాజకీయ జీవితాన్ని స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వెన్నం రాజమల్లయ్య మాట్లాడుతూ ఎం. సత్యనారాయణరావు ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చిత్తశుద్ధి, సేవాభావం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.




