Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో అంగరంగ వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవం
Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ.
Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో అంగరంగ వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవం
Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.
తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాముడు,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సురేందర్ కుమార్,సింగిల్ విండో కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో సంధ్య,ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం లవకుమార్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై గట్ల సుధాకర్, వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి,ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శ్రీనివాస్, మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో ఎంఈఓ సిరిమల్ల మహేష్,మారుతీ ట్రాక్టర్స్ మరియు డ్రైవర్స్ అసోసియేషన్ చెప్పాల స్వామి స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బంగారి రమేష్ తోపాటు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు తో ఆయా కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు.
తాసిల్దార్ కార్యాలయంలో స్వతంత్ర సమరయోధుడు ఎర్రబాటి రాజేశ్వరరావును తాసిల్దార్ రాముడు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, నాయకులు సబ్బని రాజమల్లు ఎండి మునీర్ మాదాసి సతీష్ గోలి సుధాకర్ బండ రవీందర్ రెడ్డి,తదితరులు ఉన్నారు.




