Peddapalli: పెగడపల్లి చెరువుకు రూ.98 లక్షలు.. రైతుల సంబరాలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా పెగడపల్లి పెద్ద చెరువును సాగునీటితో నింపేందుకు రూ.98 లక్షల నిధులు మంజూరయ్యాయి.

KONDAL, SULTANABAD
Published on: 23 Jun 2026 2:19 PM IST
Peddapalli
X

Peddapalli: పెగడపల్లి చెరువుకు రూ.98 లక్షలు.. రైతుల సంబరాలు!

పెద్దపల్లి: ప్రజా ప్రభుత్వంలో రైతాంగానికి అండగా నిలవాలనే లక్ష్యంతో పెగడపల్లి పెద్ద చెరువుకు సాగునీరు నింపేందుకు రూ. 98 లక్షల నిధులను మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావుకు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ పెగడపల్లి రైతాంగం పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో రాయపేట ఎత్తిపోతల పథకం నుంచి పైప్లైన్ ద్వారా పెగడపల్లి గ్రామ పెద్ద చెరువు సాగునీరు నింపేందుకు ప్రభుత్వ విప్ పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు 90 లక్షలు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ ఆధ్వర్యంలో రైతులు, గ్రామస్తులు స్వీట్లు పంచి పెట్టి విజయ రమణారావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ హుస్సేన్‌మియా వాగుపై 2009-10లో నిర్మించిన చెక్ డ్యామ్ ద్వారా ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. గతంలో రాయపేట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాయిల్ల కుంట, కొమటికుంటలు నిండేవి అని, ఇప్పుడు ఆ పైప్‌లైన్‌ను మరో కిలోమీటర్ మేర పొడిగించి పెగడపల్లి పెద్ద చెరువుకు అనుసంధానించడం ద్వారా దాదాపు 300 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందుతుందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ చెరువు కింద ఎక్కువ శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, ఈ నిర్ణయంతో వారందరికీ ఎంతో లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ​లిఫ్ట్ ఇరిగేషన్ పట్ల కింది ప్రాంతాలైన శ్రీరాంపూర్, మొట్లపల్లి, చిన్నరాతపల్లి,గంగారం గ్రామాల ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సారయ్య గౌడ్ స్పష్టం చేశారు. వర్షాలు పడి వాగులు ఉధృతంగా ప్రవహించి, నీరు వృథాగా మానేరులోకి పోయే సమయంలో మాత్రమే ఈ మోటార్లను ఆన్ చేసి చెరువులను నింపుతారని వివరించారు. ఎండాకాలంలో గానీ, నీళ్లు లేని సమయంలో గానీ మోటార్లు నడపడం సాధ్యం కాదన్నారు.

​రైతుల చిరకాల కోరికను గుర్తించి నిధులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే విజయ రమణారావుకు, సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్‌కు పెగడపల్లి గ్రామ ప్రజలు, రైతాంగం మరియు అన్ని రాజకీయ పార్టీల తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గజనవేనా సదయ్య, ఉప సర్పంచ్ పత్తి శ్రీనివాసరెడ్డి, సుముఖం మల్లారెడ్డి, అయితే శ్రీనివాస్, నక్కల కొమురయ్య జంగా స్వామి రెడ్డి తోడి సదయ్య ఈర్ల శ్రీనివాస్ కలవల తిరుపతి వీరగోని సదయ్య గొపగోని శ్రీకాంత్ కూకట్ల నవీన్ యాదవ్ గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story