Peddapalli: పెద్దాపూర్‌లో భక్తిశ్రద్ధలతో 9వ గిరిప్రదక్షిణ.. సౌకర్యాల కరువు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్‌లో కార్తిక పౌర్ణమి సందర్భంగా 9వ గిరిప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో జరిగింది.

RAJU, PEDDAPALLI
Published on: 24 Nov 2026 1:23 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దాపూర్‌లో భక్తిశ్రద్ధలతో 9వ గిరిప్రదక్షిణ.. సౌకర్యాల కరువు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా 9వ గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తూ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. కార్తిక పౌర్ణమి వేళ భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

అయితే, ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా ఉండటంతో మంచినీటి కోసం భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

అలాగే ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైట్లు పనిచేయకపోవడంతో రాత్రివేళ వెలుతురు సమస్య నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ, ప్రతి పౌర్ణమికి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారని, వారికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. అదేవిధంగా గిరిప్రదక్షిణలో అరుణాచలంలో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందని భక్తులు పేర్కొన్నారు.

నిరుపయోగంగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్‌కు వెంటనే మరమ్మతులు చేసి భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని, సెంట్రల్ లైట్లను పునరుద్ధరించి ఆలయ పరిసరాల్లో తగిన వెలుతురు ఏర్పాటు చేయాలని కోరారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI