Karimnagar: కరీంనగర్ ఘనంగా ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం

Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం. అంబేద్కర్ చౌక్ నుండి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ. విద్యార్థుల సమస్యలపై పోరాటంలో ఏబీవీపీ ముందంజ.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 9 July 2026 3:02 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ ఘనంగా ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం

కరీంనగర్: అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏర్పడి 78 సంవత్సరములు గడుస్తున్న సందర్భంగా కరీంనగర్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ చౌక్ నుండి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీని నిర్వహించి తెలంగాణ చౌక్ లో ఏబీవీపీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఏబీవీపీ విద్యార్థులు నిబద్దతతో పనిచేసే విద్యార్థులని కొనియాడారు.

స్వతంత్రం ఏర్పడంకా ఏర్పడిన ఏబీవీపీ 1949 జూలై 9 వ తేదీన ఆవిర్భవించిందని నాటి నుండి నేటి వరకు దేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ అని తెలిపారు. జ్ఞానం శీలం ఏ కథ అనే నినాదంతో ముందుకు వచ్చిన ఏబీవీపీ అంచలంచలుగా ఎదుగుతూ గొప్ప రాజకీయ నాయకులను అందించిందని అన్నారు.

నేటి పౌరులే రేపటి దేశ భవిష్యత్తు అని అలాంటి మంచి భవిష్యత్తులో నాయకులు కావాలంటే ఏబీవీపీ తోనే సాధ్యమన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే నడవడిక నేర్చుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story