Karimnagar: విద్యార్థుల హక్కులకు భరోసా.. పెండింగ్ బకాయిలపై ఏబీవీపీ నిరాహార దీక్ష
Karimnagar: ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష.
Karimnagar: విద్యార్థుల హక్కులకు భరోసా.. పెండింగ్ బకాయిలపై ఏబీవీపీ నిరాహార దీక్ష
కరీంనగర్: ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కుట్రను తిప్పి కొట్టాలనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర 24 గంటల నిరాహార దీక్ష విజయవంతంగా కొనసాగింది. నిరాహార దీక్ష తెలియజేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలపడానికి ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు మంగు నరసింహాద్రి మరియు కరీంనగర్ జిల్లా ప్రముఖ్ రాచకొండ గిరిబాబు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయులు పెండింగ్ లో ఉన్నాయని, ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 2500 కోట్లు కేటాయిస్తే అనగా బడ్జెట్లో 0.77 శాతం నిధులు కేటాయిస్తే సరిపోతుందని, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల ఆసక్తి కనపడుతూ లేదని, ఇవి విద్యార్థుల బిక్ష కాదు విద్యార్థుల హక్కు అని ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర విడి తక్షణం పెండింగ్ లో ఉన్న విద్యార్థుల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థుల జీవితాలు మారడం లేదని, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు తగిన రీతిలో ప్రభుత్వం తరపు నుండి తగు రీతులు నివేదిక సమర్పించి ఈ యొక్క ఫీజు రీమార్స్మెంట్ పథకాన్ని కొనసాగించి తెలంగాణ విద్యార్థి సమాజానికి తగిన న్యాయం చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర చేసిన 24 గంటల నిరాహార దీక్షకు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు మంగు నర్సింహాద్రి మరియు జిల్లా ప్రముఖ్ రాచకొండ గిరిబాబు తో కలిసి మద్దతు తెలిపిన అనంతరం దీక్షను విరమింపజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కరీంనగర్ పూసాల విష్ణు SFD రాష్ట్ర కో - కన్వీనర్ అజయ్, రాష్ట్ర హాస్టల్స్ కో - కన్వీనర్ నందు నగర కార్యదర్శి యోగేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి, నాగరాజు, వంశీ, శివ, మనోజ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.




