Karimnagar: ఏబీవీపీ నిరసన.. కానిస్టేబుల్ పోస్టులు పెంచాలని డిమాండ్!

Karimnagar: కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5 వేల కానిస్టేబుల్ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను వంచించడమేనని కరీంనగర్‌లో ఏబీవీపీ నేత రాకేష్ మండిపడ్డారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 6 July 2026 1:12 PM IST
Karimnagar
X

Karimnagar: ఏబీవీపీ నిరసన.. కానిస్టేబుల్ పోస్టులు పెంచాలని డిమాండ్!

కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులను వంచించడమేనని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాకేష్ మండిపడ్డారు. ఈ నోటిఫికేషన్ వల్ల జిల్లాకు కనీసం 150 పోస్టులు కూడా రావని, ఇది పేద విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కరీంనగర్‌ తెలంగాణ చౌక్ లో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంపై నిరుద్యోగులను ఉసిగొల్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అదే విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే ఈ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకుని, పోస్టుల సంఖ్యను 20 వేలకు పెంచాలని రాకేష్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story