Karimnagar: జూన్ 23న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్.. ఏబీవీపీ పిలుపు!
Karimnagar: జూన్ 23న నిర్వహించబోయే రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌ను జయప్రదం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర నేత రాకేష్ పిలుపునిచ్చారు.
Karimnagar: జూన్ 23న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్.. ఏబీవీపీ పిలుపు!
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల సంరక్షణే ధ్యేయంగా ఏబీవీపీ పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాకేష్ తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పిలుపునిచ్చారు.
మౌలిక వసతుల కల్పన, ఖాళీ పోస్టుల భర్తీ తదితర డిమాండ్లతో జూన్ 23న నిర్వహించబోయే రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌ను జయప్రదం చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ బంద్‌లో పాల్గొని విద్యాసంస్థల పరిరక్షణకు సహకరించాలని రాకేష్ విజ్ఞప్తి చేశారు.
Next Story




