Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా కార్పెంటర్ల సదస్సు - 250 మందికి సన్మానం!
Karimnagar: యాక్షన్ టేసా ఆధ్వర్యంలో కార్పెంటర్ల వృత్తి నైపుణ్య సదస్సు; 250 మందికి సన్మానం. విశాఖ రాంబిల్లిలో కొత్త యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి.
Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా కార్పెంటర్ల సదస్సు - 250 మందికి సన్మానం!
Karimnagar: ఎన్నో ఏళ్ల నుంచి కార్పెంటర్లు తమ వృత్తి పరంగా చేతి వృత్తులపైనే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నారు.అలాంటి కార్పెంటర్లలో అధునాతన పరికరాలు పరిజ్ఞానంతో ముందుకు సాగుతూ వారిలో వృత్తి నైపుణ్యతను పెంచే లక్ష్యంతో యాక్షన్ టెస్సా పని చేస్తోందని యాక్షన్ టెస్సా జనరల్ మేనేజర్ డాక్టర్ వై.జనార్దన్ రెడ్డి అన్నారు.
కరీంనగర్ పరిసర ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కార్పెంటర్లకు వృత్తి నైపుణ్యత సదస్సుపై అవగాహన కార్యక్రమంను యాక్షన్ టెస్సా సౌజన్యంతో కరీంనగర్ నగరంలోని హోటల్ V పార్క్,జగిత్యాల రోడ్, కరీంనగర్ లో నిర్వహించారు.
ఈ అవగాహన కార్యక్రమంకు కార్పెంటర్లు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనరల్ మేనేజర్ డాక్టర్ వై.జనార్దన్ రెడ్డి ,బ్రాంచ్ మేనేజర్ బి.ఆర్.వి మూలా రెడ్డి ,బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ సూరజ్ బాషా, కంపెనీ స్థానిక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మహ్మద్ అజరుద్దీన్ మరియు కంపెనీ ఉత్పత్తుల అధీకృత పంపిణీదారు త్రినాథ్ ఇంటీరియర్స్ ప్రొప్రైటర్ రమేష్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి వారు మాట్లాడుతూ యాక్షన్ టేసా కంపెనీ సగర్వంగా ప్రకటిస్తోంది విశాఖపట్నం అనకాపల్లి దగ్గర రాంబిల్లిలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని 136 ఎకరాల్లో ప్రారంభిస్తున్నామని మీతో పంచుకోడానికి చాలా సంతోషిస్తున్నాం అని తెలిపారు.
ఇంజనీరింగ్ చెక్క పరిశ్రమకు వడ్రంగులు వెన్నెముక లాంటివారని అన్నారు. కార్పెంటర్లలో ఉన్న నైపుణ్యాన్ని,సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచన చేశారు.సదస్సు అనంతరం టెస్సా యాక్షన్ ఆధ్వర్యంలో 250 లమంది కార్పెంటర్లను శాలువతో సత్కరించి మెమోంటోలను అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్పెంటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




