Karimnagar: ఉద్యమకారుల వర్కింగ్ ప్రెసిడెంట్ నర్ర భూమి రెడ్డి నిలదీత!
Karimnagar: జిల్లా బోగంపాడులో ఉద్యమకారుల నేత నర్ర భూమి రెడ్డి మాట్లాడుతూ.. కేకే కమిటీ ఉద్యమకారుల గుర్తింపు పేరుతో కాలయాపన చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
Karimnagar: ఉద్యమకారుల వర్కింగ్ ప్రెసిడెంట్ నర్ర భూమి రెడ్డి నిలదీత!
కరీంనగర్ జిల్లా: ఇల్లంతకుంట మండల బోగంపాడు గ్రామంలో ఉద్యమకారుల వర్కింగ్ ప్రెసిడెంట్ నర్ర భూమి రెడ్డి మాట్లాడుతూ.
ఉద్యమకారుల కేకే కమిటీకి ఒక విన్నపము ఉద్యమకారులను గుర్తించుటలో ప్రధాన పాత్ర పోషిస్తుందని మీ కమిటీని నియమించి ప్రకటించడం జరిగింది కానీ మీరు కాలయాపన చేస్తూనే ఉన్నారు ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు ఎందుకు ఏం కనిపెట్టారు మీరు ఈ మూడు నాలుగు నెలల కాలంలో ఏమి గుర్తించారు? ఎవరిని గుర్తించారు? కనీసం గుర్తింపు కార్డులైన జారీ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశారా?
మరి ఎందుకు కమిటీ వేశారు? కనీసం ఏ జిల్లా అయినా తిరిగారా? ఎవరిని ఎవరినైనా సంప్రదించారా? మరి దేనికి మిమ్మల్ని నియమించింది కాలయాపన చేయడానికేనా? ఒక్కొక్కరు ఆస్తులు పోగొట్టుకున్నారు భూముల అమ్ముకున్నారు గాయాల పాలైనారు ఆత్మహత్య చేసుకున్నారు ఇన్ని జరిగిన కూడా కేకే కమిటీకి ఎవరు కనబడటం లేదా ఉద్యమకారులను గుర్తించడానికి చెప్పాలి మీరు కేకే కమిటీ మళ్లీ ఈ ఉద్యమం ఉధృతి చేయాలా మరి కెసిఆర్ పట్టించుకోకపోతేనే గద్దెదించినాము మరి మీరు కూడా అలానే చేస్తారా? చేస్తే కేసీఆర్కు మీకు తేడా ఏముంది?
కాబట్టి కేక్ ఏ కమిటీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు గాని 25 వేల పింఛన్ గాని 250 గజాల భూమి గానీ మంజూరు చేసే దిశగా అడుగు ముందుకు వేయాలని ఆశిస్తున్నాం అన్నారు కేకే కమిటీ ద్వారా త్వరగా ఉద్యమకారులకు అన్ని విధాల సహకరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.




