Karimnagar: తల్లిపాల వారోత్సవాలు.. పోస్టర్ ఆవిష్కరించిన అడిషనల్ కలెక్టర్లు!

Karimnagar: తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించి, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 3 Aug 2026 10:35 PM IST
Karimnagar
X

Karimnagar: తల్లిపాల వారోత్సవాలు.. పోస్టర్ ఆవిష్కరించిన అడిషనల్ కలెక్టర్లు!

కరీంనగర్: తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ అన్నారు. ఈనెల 7 వరకు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గ్రామస్థాయిలో గర్భిణీలు బాలింతలు, కుటుంబ సభ్యులకు తల్లిపాల ఆవశ్యకతను వివరించాలని తెలిపారు. బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, ముర్రుపాలలోని రోగనిరోధక శక్తి వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని తెలిపారు.

మహిళ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించి అక్కడి గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యంపై కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. పుట్టినప్పటి నుండి ఆరు నెలలు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని, రెండు సంవత్సరాల వరకు కొనసాగించాలనే విషయాన్ని తెలియజేయాలన్నారు. ముఖ్యంగా స్వయం సహాయక సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధుల సహకారంతో అవగాహన సమావేశ ఏర్పాటు చేసి తల్లిపాల ప్రాముఖ్యం వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఐసిడిఎస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story