Karimnagar: ఓటర్ల సర్వే ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్!

Karimnagar: తిమ్మాపూర్ మండలంలో ఓటర్ల ప్రత్యేక సవరణ సర్వేను కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి పరిశీలించారు బోగస్ ఓట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 5 July 2026 3:45 PM IST
Karimnagar
X

Karimnagar: ఓటర్ల సర్వే ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్!

కరీంనగర్: తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీ, గ్రామంలో సర్ ప్రక్రియను పరిశీలించి తహశీల్దార్ కర్ర శ్రీనివాస రెడ్డితో మాట్లాడారు. పలు విషయాలను అడిగి తెల్సుకున్నారు. ఇంటింట ప్రతీ ఓటరు నుండి పత్రాన్ని తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇండ్లు లేకుండా, ఓట్లు లేకుండా ఉన్నా, కొత్తగా ఎవరైనా ఆధారాలు లేకుంటే అలాంటి వారి ఓట్లను ఓటర్లను తొలగించాలని ఆదేశించారు.

ఓటర్లకు అందించిన పత్రాలలో వివరాలను నమోదు చేసిన తరువాత బీఎల్వోలు తీసుకోవాలని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని, తప్పులుంటే సూచనలు చేయాలని తెలిపారు. అనంతరం సుభాష్ నగర్ శివారులో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ గోదాంలను ఆయన పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న బ్యాంకు ఉద్యోగ పరీక్షా కేంద్రాన్ని ఆయన పరీశీలించారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story