Vemulawada: వేములవాడ ప్రమాద బాధితులను పరామర్శించిన ఏసీ
Vemulawada: అనుపురం రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్.
Vemulawada: వేములవాడ ప్రమాద బాధితులను పరామర్శించిన ఏసీ
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ శుక్రవారం పరామర్శించారు.
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన... బాధితులకు నాణ్యమైన వైద్యం, అవసరమైన మందులు, భోజనం ఎలాంటి లోటు లేకుండా అందించాలని వైద్యులను ఆదేశించారు.
రోగుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఏంజెలినా అల్ఫ్రెడ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు ప్రవీణ్, తహసీల్దార్ జయంత్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




