Karimnagar: నాణ్యమైన విత్తనాలతోనే అధిక లాభాలు.. శాస్త్రవేత్తల వెల్లడి

Karimnagar: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తన వారోత్సవాలు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 24 May 2026 4:35 PM IST
Karimnagar
X

Karimnagar: నాణ్యమైన విత్తనాలతోనే అధిక లాభాలు.. శాస్త్రవేత్తల వెల్లడి

Karimnagar: ​వ్యవసాయ పరిశోధన స్ధానం కరీంనగర్ లో షెడ్యుల్ కులాల ఉపప్రణాళిక ద్వార మొక్కజొన్న సాగులో సస్యరక్షణ, మేలైన యాజమాన్య పద్ధతుల పై శిక్షణా కార్యక్రమము నిర్వహించారు.

వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విత్తన వారోత్సవాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త మరియు వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ అధిపతి డా. బి.రాంప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలిపి పరిశోధన స్థానం లో చేపడుతున్న పరిశోధన ల గురించి వివరించారు. మేలైన విత్తనాలు ఉపయోగించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు.

ముఖ్య అతిథి గా విచ్చేసిన, జిల్లా వ్యవసాయ అధికారిని జె. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వ్యవసాయం లో నాణ్యమైన విత్తనం యొక్క పాత్రని వివరించారు. రైతులు విత్తన ఎంపికలో శ్రద్ధ వహించాలని సూచించారు.

సీనియర్ శాస్త్రవేత్త డా. ఇ.రజినీకాంత్ మాట్లాడుతూ అఖిల భారత మొక్కజొన్న పరిశోధన సంస్థ వారూ ప్రత్యేకంగా చేపట్టిన షెడ్యూలు కులాల ఉపప్రణాళిక గురించి తెలిపి , మొక్కజొన్న వానాకాలం మొక్కజొన్న సాగు లో మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కలిగించారు.

డా. బి. హరిక్రిష్ణ, TRVK కరీంనగర్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ పంటల వైవిధ్యకరణ గురించి తెలియజేస్తూ పంట మార్పిడి యొక్క ఆవశ్యకత వివరించారు. ప్రధాన పంటల్లో చీడపీడల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు దుక్కి దున్నే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.

శాస్త్రవేత్త డా. G. ఉషారాణి మాట్లాడుతూ పరిశోధన స్ధానంలో అందుబాటు లో ఉన్న విత్తనాలు గురించి వివరించారు. మొక్కజొన్న విత్తనోత్పత్తి మరియు మొక్క జొన్న లో కత్తెర పురుగు యాజమాన్యం గురించి వివరించారు.

వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త Dr. M. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్నలో విలువ ఆధారిత ఉత్త్పత్తుల మరియు డిజిటల్ వ్యవసాయం పైన అవగాహన కల్పించారు. డా. రాజేంద్ర ప్రసాద్ వరి మరియు ఇతర ప్రథాన పంటల్లో చీడపీడల గురించి తెలియజేశారు.

కార్యక్రమం అనంతరం కొత్తపల్లి గ్రామానికి చెందిన 50 మంది షెడ్యూల్ కులాల రైతులకు, కత్తెర పురుగు నివారణ కొరకు కొరజెన్ మందును పంపిణి చేసారు. అక్కడే ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం షాప్ లో పలువురు రైతులు విత్తనాలను కొనుగోలు చేశారు ఏదైనా వంగడాలను ఉత్పత్తి చేసి వ్యవసాయ పరిశోధన కేంద్రం వారు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థాన AEO నర్సింహులు, శ్రీనివాస్, శ్రీకాంత్ మరియు వంశీ కృష్ణ, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story