Jagtial: అంబరాన్నంటిన బోనాలు జగిత్యాలలో వైభవంగా జానపద జాతర!
Jagtial: జగిత్యాల మినీ స్టేడియంలో ఆషాడ మాస ముగింపు సందర్భంగా జానపద కళాకారుల ఆధ్వర్యంలో బోనాల జాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
Jagtial: అంబరాన్నంటిన బోనాలు జగిత్యాలలో వైభవంగా జానపద జాతర!
Jagtial: జగిత్యాల పట్టణంలోని మినీ స్టేడియంలో ఆషాడ మాస ముగింపు సందర్భంగా జానపద కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతర వేడుకలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా సాగాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపుదిద్దుకున్న ఈ జాతర పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
ప్రత్యేక ఆకర్షణగా 64 మంది కళాకారుల వేషధారణలు
ఈ జాతరలో దాదాపు 64 మంది జానపద కళాకారులు వివిధ రకాల వినూత్న వేషధారణలతో అలరించారు. ముఖ్యంగా అమ్మవారి రూపాలు, రౌద్ర రసంతో కూడిన పోతురాజుల వేషధారణలలో కళాకారులు చేసిన ప్రదర్శనలు, నృత్యాలు భక్తులను, ప్రేక్షకులను ముగ్ధులను చేశాయి.సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడుకోవడం మన బాధ్యత: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బోనాల జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమన సాంస్కృతీ సంప్రదాయాలను గౌరవించడం, భవిష్యత్ తరాలకు అందించడం మనందరి ప్రాథమిక కర్తవ్యం.
జగిత్యాల పట్టణంలో జానపద కళాకారుల ఆధ్వర్యంలో ఇలాంటి అద్భుతమైన జాతరను నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. జగిత్యాల జిల్లా ప్రజలందరిపై ఆ అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
హోరెత్తిన జానపద గీతాలు
ఈ వేడుకల్లో ప్రముఖ ఫోక్ సింగర్ మల్లిక్ తేజ, యూట్యూబ్ ఫోక్ స్టార్స్ మామిడాల మౌనిక, లక్ష్మి తమ జానపద పాటలతో హోరెత్తించారు. వారి పాటలకు ప్రేక్షకులు, జానపద ప్రియులు పెద్ద ఎత్తున ఈలలు, చప్పట్లతో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సాంస్కృతిక అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జాతరను విజయవంతం చేశారు.




