Karimnagar: లబ్ధిదారులకు అలాట్‌మెంట్ ఇచ్చి ఇళ్లు చూపించరా? ఐద్వా నిలదీత
Karimnagar: ఐద్వా నాయకురాలు కోనేటి నాగమణి ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, చొప్పదండి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు.
Karimnagar: లబ్ధిదారులకు అలాట్‌మెంట్ ఇచ్చి ఇళ్లు చూపించరా? ఐద్వా నిలదీత
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో నివాస స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అర్హులైన పేద, నిరుపేద కుటుంబాలకు తక్షణమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి పంపిణీ చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది నిరుపేదలు సురక్షితమైన నివాసం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, నిరుపేదలకు, మహిళా ఆధారిత కుటుంబాలకు, వితంతువులకు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి ఇళ్ల మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. చొప్పదండి మండల కేంద్రంలో పలువురికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరైన అని చెప్పి అలాట్ చేసేయమని చెప్పి ఫామ్స్ ఇచ్చారు. ఇప్పటివరకు వాళ్లకు చూపించలేదు వాళ్లకు తక్షణమే చూయించాలని అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరారు.
వెంటనే ఇందిరమ్మ ఇండ్లు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్య పరిష్కారం చేయకపోతే రాబోయే కాలాల్లో పెద్ద ఎత్తున పేద ప్రజలందరినీ సేకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షురాలు దేవా అన్నపూర్ణ, కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యురాలు చొప్పదండి మండల కేంద్రం కార్యదర్శి గుంటుపల్లి వసంత, నగర టౌన్ కార్యదర్శి చేని రోజా రాణి, వెంకటవ్వ, లక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.




