Karimnagar: స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఖాళీ పర్సులతో ఏఐఎస్ఎఫ్ వినూత్న నిరసన!
Karimnagar: ఎన్నికల హామీలైన స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో ఏఐఎస్ఎఫ్ వినూత్న నిరసన చేపట్టింది.
Karimnagar: స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఖాళీ పర్సులతో ఏఐఎస్ఎఫ్ వినూత్న నిరసన!
కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను, 5లక్షల విద్య భరోసా కార్డును, పెండింగ్ ఫీజు బకాయిలను అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యార్థుల హామీల అమలు చేయకుండా విద్యార్థులకు ఓట్లు లేవని చిన్నచూపు చూస్తున్నాడని, రాష్ట్రంలో విద్యార్థులు సమస్యల కోసం ప్రతి రోజు రోడ్డు ఎక్కుతున్నారని,సీఎం వద్ద విద్యాశాఖ ఉంది కమిషన్ల కోసమేనని, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం తప్పదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఖాళీ పర్సులను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ,స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులు వారి తల్లితండ్రులు జేబులోంచి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని దీంతో పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను, యువవికాసం పేరుతో 5లక్షల విద్యా భరోసా కార్డు ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని , ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నాం ఇది ప్రజాపాలనని చెబుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల హామీలను అమలుచేయకాపోవడానికి కారణం ఎందని? విద్యార్థుల హామీల అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఓట్లతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బడ్జెట్ లో 15%నిధులు ఇవ్వాలని ,ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా వాటిని అమలు చేసి విద్యార్థుల పట్ల తమ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని, రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యా శాఖకు న్యాయం చేయకుంటే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని లేనిపక్షంలో ఢిల్లీ తరహా ఉద్యమాన్ని తెలంగాణ గల్లీలలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు.
కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్,నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్, గర్ల్స్ వింగ్ నాయకురాలు జోష్ణ,నగర నాయకులు సందీప్ రెడ్డి, బోయినీ విష్ణు, అరవింద్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




