Siddipet: బేగంపేట గ్రామాల్లో ఓటరు నమోదు కార్యక్రమం తహసిల్దార్‌!

Siddipet: సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంలో జరిగిన ఎస్‌ఐఆర్ (SIR) ఓటరు నమోదు కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుండా శంకర్

KARUNAKAR,	DUBBAK
Published on: 9 July 2026 6:31 PM IST
Siddipet
X

Siddipet: బేగంపేట గ్రామాల్లో ఓటరు నమోదు కార్యక్రమం తహసిల్దార్‌!

సిద్దిపేట: ఓటర్ మహాశయులు ప్రతి ఒక్కరూ ఎస్ ఐ ఆర్ లో ఓటర్ యొక్క వివరాలను నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట భూoపల్లి మండల అధ్యక్షుడు గుండా శంకర్ అన్నారు.

గురువారం మండలంలోని తాళ్లపల్లి,బేగంపేట గ్రామాల సర్పంచులు ప్రభాకర్ , చంద్రశేఖర్,మండల తహసిల్దార్ బాలరాజు తో కలిసి ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గుండా శంకర్ మాట్లాడుతూ,ప్రజాస్వామ్య విధానంలో ప్రతి ఓటు అమూల్యమైనదన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకులు తమ పేరు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని తెలిపారు. పేరు లేకపోవడం, చిరునామా మారడంతో పాటుగా మరే విధమైన లోపాలతో నైనా విలువైన ఓటు హక్కును కోల్పోకూడదన్నారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ఓటర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్, ప్రతాప్, ప్రభాకర్, రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story