Jammikunta: జమ్మికుంటలో ఘనంగా అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకలు!

Jammikunta: జమ్మికుంట అన్నపూర్ణ టాకీస్‌లో అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన అభిమానులు, పాల్గొన్న వార్డు కౌన్సిలర్ సురేష్.

GANESH, JAMMIKUNTA
Published on: 29 Aug 2026 2:04 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో ఘనంగా అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకలు!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అన్నపూర్ణ టాకీస్ లో డాన్ రమేష్ ఆధ్వర్యంలో నాగార్జున జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ కొలుగూరి సురేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

అనంతరం రమేష్ మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు, కుమారుడు కింగ్ నాగార్జున విక్రమ్ సినిమాతో పరిచయమై శివా, గీతాంజలి, నిన్నే పెళ్లాడుతా ,అన్నమయ్య, మన్మధుడు, మనం, సోగ్గాడే చిన్నినాయన, వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తో ప్రేక్షకుల మెప్పు పొందిన వ్యక్తిగా ఇండస్ట్రీలో స్థిర స్థాయిగా నిలిచిపోయారు, ప్రేక్షకులకు అభిమానులకు మంచి మంచి చిత్రాలు అందించి ప్రేక్షకులను అలరించాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు డాన్ రమేష్, మండల అధ్యక్షుడు రాజేష్, చందు, శ్రీనివాస్, శ్రీకాంత్, వడ్లూరు సంపత్, వడ్లూరి శశి కుమార్, గుల్లి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story