Karimnagar: ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి జన్మదినాన సేవా కార్యక్రమాలు
Karimnagar: ప్రముఖ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నియో కేర్ అనాథాశ్రమంలో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
Karimnagar: ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి జన్మదినాన సేవా కార్యక్రమాలు
Karimnagar: ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నియో కేర్ అనాథాశ్రమంలో సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంధి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో అనాథాశ్రమంలోని చిన్నారులకు నోట్‌బుక్స్, పెన్నులు, పండ్లు పంపిణీ చేసి వారి పట్ల తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ బోలుమల శంకర్, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, రెడ్ క్రాస్ చైర్మన్ పెండ్యాల కేశవరెడ్డి, ఆర్‌బీవీఆర్‌ఆర్ సలహాదారు బద్దం మోహన్ రెడ్డి, కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి హాజరై చిన్నారులకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంతల సత్యనారాయణ రెడ్డి, గవ్వ వంశీధర్ రెడ్డి, ఎర్రోళ్ల మల్లేశం, కలికిరెడ్డి ఆనంద్ యాదవ్, చింతల శ్రీనివాస్ రెడ్డి, నోముల సాగర్ రెడ్డి, నిమ్మ రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూ, డాక్టర్ వి. నరేందర్ రెడ్డి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలోని నిరుపేదలు, అనాథ చిన్నారులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.




