Karimnagar: కరీంనగర్ ఘనంగా ఊట్కూరు నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Karimnagar: కరీంనగర్‌లో కాంగ్రెస్ నాయకుడు, ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. తెలంగాణ చౌక్‌లో భారీ కేక్ కట్ చేసిన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 8 July 2026 3:18 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ ఘనంగా ఊట్కూరు నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

కరీంనగర్: కాంగ్రెస్ నాయకులు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ ఊట్కూరు నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నగరంలో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారు.

ఎన్ ఎస్ ఏ మాజీ అధ్యక్షుడు ఫహాదా ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో భారీ కేకును కట్ చేసి మిఠాయిలు పంచి బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మంచి నాయకుడు విద్య దానం పేదలకు చాలామందికి ఉచితంగా విద్యను అందిస్తున్న నరేందర్ రెడ్డి కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ప్రజలకు నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న నరేందర్ రెడ్డి కి తరపున శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళ నాయకురాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story