Kamanpur: కమాన్‌పూర్‌లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం: వైనాల రాజు

Kamanpur: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం గొల్లపల్లిలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు ప్రారంభించారు.

SHANKAR, MANTHANI
Published on: 12 Nov 2026 7:23 PM IST
Kamanpur
X

Kamanpur: కమాన్‌పూర్‌లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం: వైనాల రాజు

Kamanpur: ఆరుగాలం కష్టపడి పంట పండించిన పత్తి రైతులకు గిట్టుబాటు ధర భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు అన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు గొల్లపల్లి గ్రామంలోని పరమేశ్వర ఆగ్రోస్ పత్తి మిల్లులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఖరీఫ్ సీజన్ కోసం పత్తికి క్వింటాలుకు రూ.8,667 మద్దతు ధర నిర్ణయించారని, గత ఏడాది కంటే రూ.557 పెంచారని తెలిపారు. దళారుల చేతిలో మోసపోకుండా రైతులు తమ పత్తిని సీసీఐ కేంద్రంలోనే అమ్ముకోవాలని కోరారు.

ఎలక్ట్రానిక్ తూకం, తేమ శాతం పరీక్షించి నాణ్యత ప్రకారం కొనుగోలు చేసి, డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారని, మధ్యవర్తులు ఉండరని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి ఈర్ల సురేందర్, జిన్నింగ్ మిల్లు యజమాని కృష్ణ అగర్వాల్, డైరెక్టర్లు దాసరి గట్టయ్య, అనవేన సదయ్య, జడల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI