Sircilla: అమృత్ పైప్‌లైన్ పనుల నిర్లక్ష్యం.. స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం!
Sircilla: సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేట బైపాస్ చౌరస్తా వద్ద అమృత్ స్కీం పైప్‌లైన్ పనుల నిర్లక్ష్యం వల్ల స్కూల్ బస్సు గుంతలో కూరుకుపోయింది.
Sircilla: అమృత్ పైప్‌లైన్ పనుల నిర్లక్ష్యం.. స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం!
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేట బైపాస్ చౌరస్తా వద్ద అమృత్ స్కీం కింద చేపట్టిన పైప్‌లైన్ పనుల్లో నిర్లక్ష్యం కారణంగా స్కూల్ బస్సు రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఇరుక్కుపోయి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికుల కథనం ప్రకారం.. అమృత్ స్కీం కింద పైప్‌లైన్ వేసిన అనంతరం గుంతను సక్రమంగా మట్టితో పూడ్చకపోవడంతో రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. అదే మార్గంలో వెళ్తున్న స్కూల్ బస్సు ఆ గుంతలో కూరుకుపోయింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులు, డ్రైవర్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం తెలుసుకున్న స్థానికులు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి బస్సును బయటకు తీసేందుకు సహకరించారు. అందరూ కలిసి బస్సును పైకి లేపి సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
అమృత్ స్కీం పనులు పూర్తయిన తర్వాత రహదారిని సరిగా పునరుద్ధరించకపోవడం వల్లే ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌తో పాటు సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, రహదారిని శాశ్వతంగా మరమ్మతు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.




