Dharmapuri: ధర్మపురి గోదావరి నదిలో బయటపడ్డ పురాతన నరసింహస్వామి విగ్రహం!

Dharmapuri: జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి ఇసుక తిన్నెల్లో లక్ష్మీనరసింహస్వామి పురాతన విగ్రహం లభ్యం.

RAMESH, DHARMPURI
Published on: 14 July 2026 12:21 PM IST
Dharmapuri
X

Dharmapuri: ధర్మపురి గోదావరి నదిలో బయటపడ్డ పురాతన నరసింహస్వామి విగ్రహం!

Dharmapuri: ధర్మపురి గోదావరిలో ఇసుకనుండి బయటపడ్డ లక్ష్మీ నరసింహుడి విగ్రహం....

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి ఇసుక నుండి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం బయటపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.గోదావరీ లోని దిగువ ప్రాంతంలో పురాతన నరసింహుని విగ్రహం కనిపించింది. జాలర్లు కొందరు ఇసుక కింద విగ్రహం కనపడటంతో బయటకు తీశారు. ఈ విగ్రహం నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చి ఉండవచ్చని, ప్రస్తుతం నీటి మట్టం పూర్తిగా తొలగి పోవడంతో బయటకు వచ్చినట్లు భావిస్తున్నారు.స్థానికులు ఈ విగ్రహానికి తులసీ మాలలు వేసి పూజలు చేశారు. పురాతత్వ శాఖ అధికారులు పరిశీ లించి భద్రపరచాలని స్థానికులు కోరుతున్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI

Next Story