Peddapalli: దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం!
Peddapalli: దివ్యాంగుల కోసం కేటాయించిన 19 బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గడువు డిసెంబర్ 10గా ప్రకటించారు.
Peddapalli: దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం!
Peddapalli: కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగులకు రిజర్వు చేయబడిన 19 బ్యాక్లాగ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఉద్యోగ ఖాళీలలో ఆఫీస్ సబార్డినేట్ 08, వాచ్మెన్ 02, కుక్ 02, కామాటి 01, పబ్లిక్ హెల్త్ వర్కర్ 04, స్వీపర్ 01, తోటి 01 పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఇవి గ్రూప్-IV కాని ఉద్యోగ ఖాళీలని పేర్కొన్నారు.
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, వాచ్మెన్ పోస్టులకు 5వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని సూచించారు. కుక్, కామాటి, పబ్లిక్ హెల్త్ వర్కర్, స్వీపర్, తోటి పోస్టులకు చదవడం, రాయడం వచ్చి ఉండాలని తెలిపారు.
సంబంధిత ఉద్యోగాలకు నిర్దేశించిన విద్యార్హతల్లో సాధించిన మార్కులు, అభ్యర్థుల అంగవైకల్య శాతం, వయస్సు ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, నియమ నిబంధనలు, దరఖాస్తు ఫారాలు పెద్దపల్లి జిల్లా అధికారిక వెబ్సైట్ https://peddapalli.telangana.gov.in లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అర్హులైన దివ్యాంగ అభ్యర్థులు డిసెంబర్ 10, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
ఈ ఉద్యోగ అవకాశాలను అర్హులైన దివ్యాంగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం 9440852495 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆ ప్రకటనలో పేర్కొన్నారు.




