Peddapalli: గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్స్ పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం!
Peddapalli: పెద్దపల్లి జిల్లాలోని 11 పీఎం శ్రీ పాఠశాలల్లో గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతున్న జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద.
Peddapalli: గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్స్ పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం!
Peddapalli: జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద పెద్దపల్లి జిల్లాలోని సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో (11) పి.ఎం. శ్రీ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ప్రత్యేకావసరాల పిల్లల విద్యాబోధన కోసం తాత్కాలిక పద్ధతిన (ఐదు నెలల కాలానికి) గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్స్ నియామకానికి అర్హులైన, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలోని పి యం శ్రీ పాఠశాలల్లో పీఎం శ్రీ రామగుండం,జడ్.పి.హెచ్.ఎస్ కమాన్పూర్ ,జడ్.పి.హెచ్.ఎస్. అప్పన్న పేట్, జడ్.పి.హెచ్.ఎస్. పోత్కపల్లి, జడ్.పి.హెచ్.ఎస్. ఏ క్లాస్పూర్, టి.జి.డబ్ల్యు.ఆర్.ఇ.ఐ.ఎస్. మేడారం,టి.జి.డబ్ల్యు.ఆర్.ఇ.ఐ.ఎస్. మల్లాపూర్,
టి.జి.ఎం.ఎస్. రామగుండం,
టి.జి.ఎం.ఎస్. జూలపల్లి, టి.జి.ఎం.ఎస్. మల్యాల్ (శ్రీరాంపూర్), టి.జి.డబ్ల్యు.ఆర్.ఇ.ఐ.ఎస్. మంథనిల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 10 లోపు ధృవపత్రాలు, దరఖాస్తులు సమర్పించాలని, ఈ నియామకం ద్వారా ఎంపికైన వారికి నెలకు రూ. 16,500/- గౌరవ వేతనంగా అందజేయనున్నట్లు తెలిపారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం సంబంధిత విద్యాలయాల ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్‌లను సంప్రదించాలని, జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.




