Karimnagar: ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు దుర్మార్గం: తిమ్మాపూర్‌లో నిరసన!

Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో ఆశా వర్కర్లు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ, రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 9 Sept 2026 10:18 PM IST
Karimnagar
X

Karimnagar: ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు దుర్మార్గం: తిమ్మాపూర్‌లో నిరసన!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం తిమ్మాపూర్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద నిరసన ప్రోగ్రాం ఉండగా ఉదయమే తమ ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు అందరినీ అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లకు తరలించారని, సాయంత్రం వరకు అక్కడే ఉంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు రూ.18వేల ఫిక్సుడు జీతం ఇవ్వాలని, తమకు టార్గెట్లు విధించవద్దని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తాము నిరసన తెలిపితే కాంగ్రెస్ పెద్దలు వచ్చి తాము అధికారంలోకి రాగానే హామీలను నెరవేరుస్తామని మాట ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆశ వర్కర్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ మండల అధ్యక్షురాలు నాయిని రజిత, ప్రధాన కార్యదర్శి బూద రజిత, కోశాధికారి తాటి పెళ్లి పద్మ, వెంకటలక్ష్మి, జ్యోతి, అనిత, రాజేశ్వరి, మంగ, కవిత, మంజుల, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU