Ashwaraopeta: రామన్నగూడెంలో అటవీ సిబ్బందిపై ఆగ్రహం పోలీస్ స్టేషన్ ముట్టడి
Ashwaraopeta: అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో సర్పంచ్ కంది పంటను అటవీ సిబ్బంది ధ్వంసం చేయడంపై గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం. అటవీ బేస్ క్యాంప్ ధర్నా, పోలీస్ స్టేషన్ ముట్టడి.
Ashwaraopeta: రామన్నగూడెంలో అటవీ సిబ్బందిపై ఆగ్రహం పోలీస్ స్టేషన్ ముట్టడి
అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామంలో కంది పంట ధ్వంసం ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ సర్పంచ్ మడకం నాగేశ్వరరావుకు చెందిన పట్టా పొలంలో సాగు చేసిన నాలుగు ఎకరాల కంది పంటను అటవీశాఖ సిబ్బంది ధ్వంసం చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
రామన్నగూడెం టేక్ ప్లాంటేషన్ సమీపంలోని అటవీశాఖ బేస్ క్యాంపు వద్ద గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. సాగు చేసిన పంట ధ్వంసం కావడంతో రైతుకు నష్టం వాటిల్లిందని, ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
రైతుకు జరిగిన నష్టంపై అధికారులు విచారణ జరిపి, భూమి హక్కులు, పంట సాగుకు సంబంధించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గిరిజనుడికి జరిగిన నష్టనికి ఫారెస్ట్ అధికారి సమాధానం చెప్పాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందచేశారు....




