Saidapur: సైదాపూర్‌లో దివ్యాంగులు, వృద్ధుల సహాయ ఉపకరణాల శిబిరం!

Saidapur: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రారంభించారు.

RAJU, HUZURABAD
Published on: 16 Nov 2026 2:20 PM IST
Saidapur
X

Saidapur: సైదాపూర్‌లో దివ్యాంగులు, వృద్ధుల సహాయ ఉపకరణాల శిబిరం!

కరీంనగర్ జిల్లా: సైదాపూర్ మండల కేంద్రంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఒక మున్సిపాలిటీ, ఏడు మండలాలకు చెందిన దివ్యాంగులు, వృద్ధులు శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో అర్హులను గుర్తించి శిబిరానికి తీసుకురావాలని కోరారు. పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ ఉపకరణాలు అందజేస్తామని మంత్రి తెలిపారు.

RAJU, HUZURABAD

RAJU, HUZURABAD