Karimnagar: దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం
Karimnagar: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ బాలబాలికలకు ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు తదితర ఉపకరణాలు పంపిణీ చేశారు.
Karimnagar
కరీంనగర్: సమగ్ర శిక్ష మరియు అలింకో, ఆధ్వర్యంలో దివ్యాంగ బాల బాలికలకు కార్యక్రమము ఈరోజు కరీంనగర్ భవిత కేంద్రంలో నిర్వహించడం జరిగింది.
గత నవంబరులో గుర్తించబడిన (120) మంది అవసరమైన దివ్యాంగులకు, ట్రైసైకిళ్లు రోలేటరులు, వినికిడి యంత్రాలు, టి.ఎల్.ఎమ్ కిట్టు, వీల్ చైర్,మొ :ఉపకరణాలు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ , మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు,వీరికి సంబంధించిన అలవెన్సులు సౌకర్యాలను సకాలంలో అందేటట్లు చూడాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 20 లక్షల విలువగల ఉపకరణాలు ఈరోజు పంపిణీ చేయడం జరిగిందని,వారికి సేవ చేసుకోవడం అదృష్టంగా భావించాలని సూచించారు.
జిల్లా అదనపు కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారి అశ్విని తానాజీ వాకిడి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా సౌకర్యాలు అందజేయాలని ఎవరిని విస్మరించకూడదని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ , సుడా చైర్మెన్ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకిడే, జిల్లా సంక్షేమ అధికారిని సరస్వతి , జిల్లా విద్యా శాఖ ఎడి,శ్రీ రామ్ మొండయ్య , కరీంనగర్ మండల విద్యాశాఖ అధికారి శ్రీ భద్రయ్య , కోఆర్డినేటర్ డి.శ్రీనివాస్,స్థానిక కార్పొరేటర్ పడాల శ్రీజ,ఐ ఇ ఆర్ పి లు,తల్లిదండ్రులు, దివ్యాంగ పిల్లలు పాల్గొన్నారు.




