Jammikunta: ఘనంగా అవొపా మెరిట్ అవార్డ్స్.. విద్యార్థులకు ఘన సత్కారం!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఆర్యవైశ్య అవొపా (AVOPA) ఆధ్వర్యంలో "అవొపా మెరిట్ అవార్డ్స్ 2026" కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.

GANESH, JAMMIKUNTA
Published on: 26 July 2026 5:50 PM IST
Jammikunta
X

Jammikunta: ఘనంగా అవొపా మెరిట్ అవార్డ్స్.. విద్యార్థులకు ఘన సత్కారం!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఆధ్వర్యంలో "అవొపా మెరిట్ అవార్డ్స్ 2026" కార్యక్రమం ఆదివారం ఘనంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు, పెద్దలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఇతర పోటీ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులను అవొపా సంఘం గుర్తించి మెమెంటోలు, ప్రశంసా పత్రాలతో సత్కరించింది. వేదికపై సంఘ ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొని అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా అవొపా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అవొపా అధ్యక్షులు అకినపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆవోప అధ్యక్షులు మల్లిపెద్ది శంకర్,కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కొమురవెల్లి వెంకటేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబోయిన రమేష్, సామానారాయణ, పివి రామకృష్ణ, జిల్లా బాధ్యులు ఐత సుధాకర్, మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు లెంకళ్లపల్లి శరత్ కుమార్,జమ్మికుంట అవొపా అధ్యక్షులు అకినపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నగేష్, మంచాల రాంబాబు,జోన్ ట్రెజరర్ బచ్చు రమేష్, సంఘ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story