Choppadandi: చొప్పదండిలో బాలికల అవగాహన సదస్సు విజయవంతం

Choppadandi: కరీంనగర్ చొప్పదండిలో యుక్త వయస్సు బాలికలకు ఆరోగ్యం, విద్య, భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 29 April 2026 10:41 AM IST
Choppadandi
X

Choppadandi

Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యుక్త వయస్సు బాలికల కోసం నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సు విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరితా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.

స్నేహ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని బాలికలకు మార్గదర్శకత్వం అందించారు. బాలికల ఆరోగ్యం, విద్య, భద్రత, ఆత్మవిశ్వాసం, స్వయం సాధికారత వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు, బాలికలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని, విద్య ద్వారా తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ప్రతి ఆడబిడ్డ తన లక్ష్యాలను సాధించేందుకు కుటుంబం, సమాజం పూర్తి సహకారం అందించాలని పేర్కొన్నారు.

మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, బాలికల అభివృద్ధి సమాజ పురోగతికి పునాది అని తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story