Thimmapur: నుస్తులాపూర్‌లో బాల్య వివాహ నిర్మూలన దినోత్సవ అవగాహన ర్యాలీ!

Thimmapur: తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ పాఠశాలలో అంతర్జాతీయ బాల్య వివాహ నిర్మూలన దినోత్సవం సందర్భంగా శుక్రవారం అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 27 Nov 2026 7:39 PM IST
Thimmapur
X

Thimmapur: నుస్తులాపూర్‌లో బాల్య వివాహ నిర్మూలన దినోత్సవ అవగాహన ర్యాలీ!

కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల స్కూల్ లో అంతర్జాతీయ బాల్య, బలవంతపు బాల్య వివాహ నిర్మూలన దినోత్సవం 27- నవంబర్ 2026 భాగంగా "బాల్యవివాహాలు లేని భారతదేశం కోసం ఒక జ్యోతిని వెలిగించు "అనే ఈ సంవత్సరం నినాదంతో విద్యార్థి విద్యార్థులకు అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది.

అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ బాల్య బలవంతపు బాల్య వివాహ నిర్మూలన దినోత్సవం ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 4 2026 ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్ ఫలితంగా ఈ ఈ దినోత్సవం జరిగింది.

కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్ భారతదేశ మొత్తం 3 స్వచ్ఛంద సంస్థలతో 782 జిల్లాలలో బాల్య వివాహ నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కాబట్టి బాల్య వివాహం అనగా 18 సంవత్సరాల ఒక అమ్మాయి 21 సంవత్సరాలలోపు అబ్బాయి పెళ్లి చేసుకోవడం నేరం 2026 బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం లక్ష రూపాయల జరిమానా రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడును అని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ పిల్లలు మత్తు పదార్థాలకు పదార్థాలకు దూరంగా ఉండాలని మరియు సోషల్ మీడియాను సరైన క్రమంలో వాడుకోవాలని పిల్లలకి ఎటువంటి సమస్యలు ఉన్న 1098 కాల్ చేయాలని ఇది ఉచితం 24 గంటల సర్వీస్ కలిగి ఉంటుందని మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఉమెన్ హబ్ జెండర్ స్పెషలిస్ట్ శ్రీమతి శైలజ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఇస్తున్న సర్వీసెస్ గురించి సవివరంగా చెప్పడం జరిగింది

అలాగే లీగల్ సర్వీస్ అథారిటీ అడ్వకేట్ రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు లక్ష్యం పెట్టుకొని చదువుకోవాలని అలాగే వారి యొక్క రోల్ మోడల్ ఎంచుకొని వారు చేసి కృషి మీరు చేసి జీవితంలో ఎదగాలని నీకు న్యాయ సమస్యలున్న కరీంనగర్ జిల్లాలోని కోర్టులో మా ఆఫీస్ నుండి సంప్రదించగలరని కోరారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU