Sircilla: బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు చిరస్మరణీయం కాంగ్రెస్ నివాళి!
Sircilla: డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
Sircilla: బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు చిరస్మరణీయం కాంగ్రెస్ నివాళి!
సిరిసిల్ల: భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలోనూ, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, వార్డు అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు, మాజీ కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




