Karimnagar: బిజెపి ఎండోమెంట్ జిల్లా కన్వీనర్‌గా శివకుమార్ నియామకం

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు బచ్చు శివకుమార్ (శివన్న) బిజెపి ఎండోమెంట్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా నియమితులయ్యారు.

GANESH, JAMMIKUNTA
Published on: 30 Jun 2026 2:18 PM IST
Karimnagar
X

Karimnagar: బిజెపి ఎండోమెంట్ జిల్లా కన్వీనర్‌గా శివకుమార్ నియామకం

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన బచ్చు శివకుమార్ (శివన్న) ఇటీవల భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా నియమితులైన సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బచ్చు శివకుమార్‌కు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ పట్ల ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ, సేవా దృక్పథాన్ని గుర్తించి పార్టీ అధిష్టానం ఈ కీలక బాధ్యతలను అప్పగించిందని నాయకులు పేర్కొన్నారు.

బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, హిందూ దేవాలయాల పరిరక్షణ, ధార్మిక కార్యక్రమాల అభివృద్ధి, పార్టీ బలోపేతానికి బచ్చు శివకుమార్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎండోమెంట్ విభాగానికి సంబంధించిన అంశాల్లో ఆయన అనుభవం పార్టీకి మరింత ఉపయోగపడుతుందని, జిల్లాలోని దేవాలయాల అభివృద్ధి, భక్తుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బచ్చు శివకుమార్, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ఎండోమెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. దేవాలయాల పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారం, భక్తుల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తానని తెలిపారు.

అనంతరం నాయకులు బచ్చు శివకుమార్ నియామకం జమ్మికుంట పట్టణానికే గర్వకారణమని, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా ధార్మిక, సామాజిక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారని పేర్కొన్నారు.

ఈ సన్మాన కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, టంగుటూరి రాజ్‌కుమార్, సంపెల్లి సంపత్‌రావు, పొనగంటి రవికుమార్ , (పీజేఆర్), కొండ్ల నగేష్ , కడెం సతీష్ ,యాంసాని సమ్మయ్య, సిరియాల విజయ్‌కుమార్, శ్రీనివాస్, మల్లికార్జున్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బచ్చు శివకుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

“పార్టీ బలోపేతం – ధార్మిక సేవే లక్ష్యం”

ఎండోమెంట్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన బచ్చు శివకుమార్ పార్టీ ఆశయాల సాధనతో పాటు దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని నాయకులు ఆకాంక్షించారు. ఈ నియామకం పట్ల జమ్మికుంట పట్టణ బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story