Jammikunta: పెద్దంపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 200 మందికి పరీక్షలు

Jammikunta: జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామంలో బాలవికాస సంస్థ, ఆదిత్య-అమృత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

GANESH, JAMMIKUNTA
Published on: 16 July 2026 8:23 PM IST
Jammikunta
X

Jammikunta: పెద్దంపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 200 మందికి పరీక్షలు

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పెద్దంపల్లి గ్రామంలో బాలవికాస ఆధ్వర్యంలో, ఆదిత్య-అమృత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల సహకారంతో గురువారం పాఠశాల ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎగిత పద్మ-కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ, పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని అన్నారు. వ్యాధులు రాకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆహారపు అలవాట్లలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అనేక రోగాలను నివారించవచ్చని సూచించారు.

శిబిరంలో ఆదిత్య-అమృత ఆసుపత్రి వైద్య బృందం సుమారు 200 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, రూ.55 వేల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేసింది. గ్రామానికి విచ్చేసిన స్పెషలిస్ట్ వైద్యులను సర్పంచ్ ఘనంగా సన్మానించారు.

ప్రముఖ వైద్యులు డాక్టర్ భరత్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మహిపాల్ మాట్లాడుతూ సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. బియ్యం, రవ్వ, మైదా, చక్కెర వంటి తెల్లటి ఆహార పదార్థాల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని కోరారు. అధిక కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల ఊబకాయం పెరిగి మధుమేహం, రక్తపోటు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం అధికమవుతుందని హెచ్చరించారు. ప్రతిరోజూ నడకతో పాటు గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాయామశాలలను వినియోగించుకోవాలని సూచించారు.

జమ్మికుంట బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ, ప్రతి మహిళ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకుని వంటింటినే ఆరోగ్యశాలగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. బాలవికాస పరిధిలోని 14 సెంటర్లకు చెందిన 180 గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ, దాదాపు రూ.2 కోట్ల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటర్ ఆసియా, ఉపసర్పంచ్ దొడ్డే నాగరాజు, పాలకవర్గ సభ్యులు ఎం. రాజయ్య, డి. ప్రవళిక, డి. తిరుమల, ఎం. రాజేష్, డి. లావణ్య, కే. గణపతి రెడ్డి, పి. అఖిల, బాలవికాస విలేజ్ లీడర్ పి. రమ, ఆదిత్య-అమృత ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, పీఆర్‌వోలు రఫిక్, దుర్గాప్రసాద్, ఆసుపత్రి సిబ్బంది అనిల్ రావు, మహేష్, శ్రావణ్, సంతోషిని, పూజ, శ్రావ్య, సుమలతతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story