Jammikunta: ఉచిత వైద్య శిబిరం బాలవికాస, ఆదిత్య–అమృత ఆసుపత్రి సేవలు!

Jammikunta: జమ్మికుంట మండలం కోరపల్లిలో బాలవికాస సంస్థ, ఆదిత్య–అమృత హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. గ్రామస్థులకు ఉచితంగా మందుల పంపిణీ.

GANESH, JAMMIKUNTA
Published on: 18 July 2026 5:23 PM IST
Jammikunta
X

Jammikunta: ఉచిత వైద్య శిబిరం బాలవికాస, ఆదిత్య–అమృత ఆసుపత్రి సేవలు!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, జమ్మికుంట ఆదిత్య–అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో కోరపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ భరత్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మహిపాల్, డాక్టర్ గ్రీష్మ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కనీసం ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆధునిక జీవనశైలి కారణంగా పెరుగుతున్న మానసిక ఒత్తిడి గుండె జబ్బులు, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

శిబిరంలో గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందికట్ల మధుసూదన్, ఉపసర్పంచ్ బక్కతట్ల రాజు, వార్డు సభ్యులు, గ్రామ పాలకవర్గ సభ్యులు, బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, కోఆర్డినేటర్ ఆసియా, ఆదిత్య–అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, పీఆర్‌వోలు రఫిక్, దుర్గాప్రసాద్, ఆసుపత్రి సిబ్బంది అనిల్ రావు, మహేష్, శ్రావణ్, రంజిత్, పూజ, సుచిత్ర, శిల్ప, శృతి, రమేష్, సత్యనారాయణతో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story