Thimmapur: విద్యార్థులకు సమతుల్య ఆహారమే లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి
Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాన్ని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి ప్రారంభించారు.
Thimmapur: విద్యార్థులకు సమతుల్య ఆహారమే లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి
కరీంనగర్ జిల్లా: విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన సమతుల్య ఆహారం అందించడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అల్పాహారం, మధ్యాహ్న భోజన కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పిల్లలతో ముచ్చటిస్తూ అల్పాహారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అల్పాహార పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులకు ఉదయం పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యాభ్యాసానికి మేలు జరుగుతుందని తెలిపారు. అల్పాహారం, మధ్యాహ్న భోజన కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో సమయపాలన అలవడటంతోపాటు పాఠశాలలకు హాజరు శాతం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి , ఎమ్మార్వో కర్ర శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ గుజ్జుల శ్వేత, మండల అధ్యక్షులు బండారి రమేష్ , పీఏసీఎస్ చైర్మన్లు మోరపల్లి రమణారెడ్డి, గోపు తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దావు సంపత్ రెడ్డి,బండారి పల్లి లక్ష్మణ్,సర్పంచ్ గంకిడి లక్ష్మా రెడ్డి, కొమ్మెర మల్లారెడ్డి,గోపు మల్లారెడ్డి,గుజ్జుల ప్రణీత్ రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, పులి కృష్ణ, చింతల లక్ష్మారెడ్డి, తూర్పాటి అజయ్,మాచర్ల శ్రీనివాస్, అలువాల కుమార్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




