Sircilla: ఊరిలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు వస్తే నడిచేదే లేదు

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

KALEEM, SIRICILLA
Published on: 17 Jun 2026 11:25 AM IST
Sircilla
X

Sircilla: ఊరిలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు వస్తే నడిచేదే లేదు

Sircilla: ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో, గ్రామంలోకి ప్రైవేటు పాఠశాల బస్సులు మరియు వాహనాలు రాకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో బుధవారం ఒక ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితిని గమనించిన బస్సు డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తిప్పుకుని వెళ్లిపోయాడు.

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్, ఉపసర్పంచ్ బొద్దురాజు, విద్యా కమిటీ చైర్మన్ వజ్రవ్వ నర్సయ్య, వార్డు సభ్యులు శ్రీనివాస్‌తో పాటు గ్రామస్తులు దయాకర్ రెడ్డి, గంగవరపు శ్రీనివాస్, మద్దుల వేణుగోపాల్ రెడ్డి, చరణ్ గౌడ్, సాయి గౌడ్, ఖాసీం, మాచర్ల దేవరాజు, తౌఫిఖ్, ఆకారం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story