Karimnagar: మంత్రి బండి సంజయ్ ముందస్తు బర్త్‌డే వేడుకలు!
Karimnagar: బండి సంజయ్ కుమార్ 55వ జన్మదినం పురస్కరించుకుని కనగర్తి ZPHS పాఠశాలలో బీజేపీ నేత మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ.
Karimnagar: మంత్రి బండి సంజయ్ ముందస్తు బర్త్‌డే వేడుకలు!
Karimnagar: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తు జన్మదిన వేడుకలను ఇల్లందకుంట మండల కేంద్రంలోని కనగర్తి గ్రామ ZPHS హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు బండి సంజయ్ కుమార్ వీర అభిమాని మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి మాట్లాడుతూ, "విద్యే సమాజ అభివృద్ధికి పునాది" అనే భావనతో ఈ చిన్న సేవా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా, బండి సంజయ్ ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో నిండి దీర్ఘాయుష్షుతో ఉండాలని, ఇల్లందకుంటశ్రీ.సీతారామచంద్రస్వావారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి,ఉప్పుల శ్రీనివాసరెడ్డి,బచ్చల భానుచందర్,అరవింద్ రెడ్డి,ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.




