Karimnagar: యూఐడీఎఫ్ టెండర్లతో మాకేం సంబంధం? బండి సంజయ్ ఫైర్!
Karimnagar: యూఐడీఎఫ్ టెండర్ల వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ, తమపై తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు లీగల్ నోటీసులు ఇవ్వాలని మేయర్‌ను ఆదేశించారు.
Karimnagar: యూఐడీఎఫ్ టెండర్లతో మాకేం సంబంధం? బండి సంజయ్ ఫైర్!
కరీంనగర్: గత పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను భ్రష్టు పట్టించిన నాయకులే మనకు అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నారు. మనకు సంబంధం లేని విషయంలోనూ బట్ట కాల్చి మీదేస్తున్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదు. అట్లాంటి వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరమే లేదు.
వెంటనే లీగల్ నోటీసులు పంపండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోండి’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంగనర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులను ఆదేశించారు. యూఐడీఎఫ్ నిధులకు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో తమకు ఏ మాత్రం సంబంధం లేదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పారు. అయినప్పటికీ కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలనే తమపై అవినీతి బురద చల్లాలని చూస్తున్నారని చెప్పారు. అట్లాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు.
ఈరోజు కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో పలు అభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో యూఐడీఎఫ్ నిధుల అంశం, టెండర్ల వ్యవహారంపై చర్చించారు. ఈ విషయంలో తమకు సంబంధం లేనప్పటికీ పదేపదే బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తూ కావాలని బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని కొలగాని, సునీల్ రావు బండిసంజయ్ ద్రుష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పందిస్తూ ‘‘యూఐడీఎఫ్ నిధుల టెండర్ల వ్యవహారం మనకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. ఆ టెండర్లో మనకు సంబంధమేంటి? కావాలనే బట్టకాల్చి మీదేయాలనుకుంటున్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ను ఏలిన వాళ్లు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, ప్రతి పనికీ లంచాలకు అలవాటుపడ్డారు. ఇతరుల మీద కూడా అట్లాంటి బురద చల్లాలనుకుంటున్నారు. వాళ్లను ఉపేక్షించొద్దు. వెంటనే లీగల్ నోటీసులివ్వండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధం కండి’’అని సూచించారు.
బీఆర్ఎస్ అవినీతి, అరాచక పాలనతో విసిగిపోయిన కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలు బీజేపీని గెలిపించారని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతికి తావులేని విధంగా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే ఓర్వలేకపోతున్నారని తెలిపారు. ‘‘తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకూదన్నదే మా విధానం.
అదే సమయంలో నోటికి వచ్చినట్లు వాగుతూ అబద్దాలను ప్రచారం చేస్తూ ఏ తప్పు చేయకపోయినా మాపై అవినీతి బురద చల్లేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అట్లాంటి వారిపై చట్ట, న్యాయపరమైన చర్యలకూ వెనుకాడబోం. యూఐడీఎఫ్ నిధులకు సంబంధించి నిర్వహించిన టెండర్లతో మాకు సంబంధమే లేదు. ఇందులో ఏనాడూ ఇన్ వాల్వ్ కాలేదు. అయినా మాపై అవినీతి ఆరోపణలు చేస్తూ మా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. తక్షణమే వారికి లీగల్ నోటీసులివ్వండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయమైన చర్యలకు సిద్ధం కండి.’’అని మేయర్, డిప్యూటీ మేయర్ లకు స్పష్టం చేశారు.




