Sircilla:కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్‌లో ప్రమాదం తప్పిన ముప్పు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం జరిగింది.
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డిపేట నుంచి గంభీరావుపేట మండలం హరిదాస్‌నగర్‌కు వెళ్తున్న సమయంలో కాన్వాయ్‌లోని నాయకుల కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో రెండు కార్ల ముందు, వెనుక భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ జరగలేదు. ప్రమాదం అనంతరం కాన్వాయ్ కొద్దిసేపు నిలిచిపోయి, పరిస్థితిని పరిశీలించిన తర్వాత తిరిగి యథావిధిగా ప్రయాణాన్ని కొనసాగించింది.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




