చట్టం ముందు నా బిడ్డైనా సమానమే.. కుమారుడిని పోలీసులకు అప్పగించిన బండి సంజయ్

Bandi Sanjay: తన కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో న్యాయవ్యవస్థపై గౌరవంతో అతడిని పోలీసు విచారణకు అప్పగించినట్లు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 16 May 2026 9:50 PM IST
Bandi Sanjay
X

చట్టం ముందు నా బిడ్డైనా సమానమే.. కుమారుడిని పోలీసులకు అప్పగించిన బండి సంజయ్

Bandi Sanjay: మా అబ్బాయి బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపైనున్న గౌరవంతో ఈరోజు అడ్వోకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించాను అని కేంద్ర హోమ్ సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నేను ఇంతకు ముందే చెప్పిన. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే అని అన్నారు.

వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆయనను స్టేషన్ లో అప్పగిద్దామనుకున్నా మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడు అని లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాడు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు అని తెలిపారు. అందుకే కొంత జాప్యం జరిగింది.

ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించాను.న్యాయ వ్యవస్థపై నాకు సంపూర్ణమైన నమ్మకముంది. సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావొద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించాను అని చెప్పారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story