Karimnagar: నేనింతే.. ఎవరికీ భయపడను, ఎవరినీ వదలను! బండి సంజయ్ మార్క్ స్పీచ్

Karimnagar: కరీంనగర్‌లో సామాన్యుల రాజ్యం మొదలైందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. వ్యాపారులను బెదిరిస్తే ఊరుకోమని హెచ్చరిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 9:12 AM IST
Karimnagar
X

Karimnagar: నేనింతే.. ఎవరికీ భయపడను, ఎవరినీ వదలను! బండి సంజయ్ మార్క్ స్పీచ్

కరీంనగర్: ‘‘నేనింతే. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటా. కష్టపడి పైకి వచ్చిన. నా దగ్గరకు పనుల కోసం వచ్చే ఏ ఒక్కరి దగ్గర పైసలు ఆశించను. వాళ్లకు సేవ చేయడంలోనే నాకు త్రుప్తి ఉంది. భవిష్యత్తులోనూ ఇట్లానే ఉంటా. నేనెప్పటికీ మీ సేవకుడినే’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేని రీతిలో ముఖ్యంగా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా కార్పొరేషన్ లో సేవలు అందించేందుకు క్రుషి చేస్తానన్నారు. ‘‘ఇకపై ఆర్యవైశ్యులతోపాటు వ్యాపారాలు చేసుకునే వాళ్లెవరూ భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే కరీంనగర్ లో సామాన్యుల రాజ్యం వచ్చింది. నా గురించి మీకు తెలుసు. మేయర్, డిప్యూటీ మేయర్ సామాన్యులే. ఇకపై వ్యాపారులను ఎవరూ బెదిరించరు. బ్లాక్ మెయిల్ చేయరు. అందమైన, ఆదర్శవంతమైన కరీంనగర్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం’’ అని చెప్పారు.

కరీంనగర్ గాంధీ రోడ్ లోని వైశ్య భవన్ లో ఈరోజు సాయంత్రం జరిగిన ‘‘ఆర్యవైశ్య కార్పొరేటర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి’’ కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతోపాటు పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అమిత్ షా, పీయూష్ గోయల్ వంటి టైగర్లు వైశ్యులే. బీజేపీలో అగ్రస్థానంలో ఎంతో వైశ్యులు ఉన్నారు. కరీంనగర్ లో ఇద్దరు వైశ్యులు కార్పొరేటర్లే.

అవినీతికి ఆస్కారమివ్వను.. బ్లాక్ మెయిల్ దందాలకు తావివ్వను..

ఇకపై ఆర్యవైశ్యులెవరూ భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే సామాన్యుల రాజ్యం వచ్చింది. వ్యాపారులను ఎవరూ బెదిరించరు. బ్లాక్ మెయిల్ చేయరు. నా దగ్గరికి ఎన్నో పనుల కోసం నా వద్దకు వస్తారు. నేను ఎవరి దగ్గర పైసలు ఆశించను. అవినీతికి నేను దూరం. ఎన్నికల ఖర్చు కోసం దాతల సాయం కోరతా. వాళ్లిచ్చే సాయంతోనే ఎన్నికల్లో ఖర్చు చేస్తా తప్ప.. ఎవరినో బ్లాక్ మెయిల్ చేసి, మందిని ముంచి డబ్బులు వసూలు చేయను.

కార్పొరేషన్ లో అవినీతి ఆస్కారం లేకుండా చేస్తా..

బీజేపీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేసే వాళ్లే. మీ అందరి ఆశీర్వాదంవల్లే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకున్నా. మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. కరీంనగర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా.

కరీంనగర్ లో కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని ఎప్పటి నుండో చూస్తున్నా. అభివ్రుద్ధి కన్పించడం లేదు. దానికి కారణం ఆర్యవైశ్యులే. డబ్బులున్నా అభివ్రుద్ధి చేయాలంటే భయపడుతున్నారు. ఇకపై ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. నిజాయితీగా, పారదర్శకంగా పనిచేయండి. అట్లాంటి వాళ్లకు పూర్తిగా సహకరిస్ పారదర్శకంగ ఆర్యవైశ్య సంఘ ఎన్నికలు జరిపి కార్యవర్గాన్ని ఎన్నుకోండి. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండండి. మీరు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించకుంటే నేనే ప్రత్యేకంగా ఎన్నికల టీంను నిలబెడతా అన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story