Karimnagar: నియోజకవర్గాల విభజనపై మేధావి వర్గం గళం విప్పాలి!

Karimnagar: కరీంనగర్‌లో జరిగిన మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 20 April 2026 9:18 PM IST
Karimnagar
X

Karimnagar: నియోజకవర్గాల విభజనపై మేధావి వర్గం గళం విప్పాలి!

Karimnagar: డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై మేధావులు పెదవి విప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మేధావులకు రాజకీయాలతో పనిలేదు. వ్యక్తులతో పనిలేదు. సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది.

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదు.’’అని అన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై అంబేద్కర్ నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారని గుర్తు చేశారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు.

‘‘ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లండి. అంబేద్కర్ కోరుకున్నట్లుగా అట్టడుగునున్న వర్గాలందరికీ ఆర్దిక, సామాజిక సమానత్వం + రాజకీయ స్వేచ్ఛ హక్కులు దక్కేందుకు మీ వంతు సహకారం అందించండి. వాటి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మోదీ సర్కార్ కు అండగా నిలవాలని చేతులెత్తి విజ్ఝప్తి చేస్తున్నా.’’అని పిలుపునిచ్చారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story