Karimnagar: కరీంనగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. కేంద్ర మంత్రి

Karimnagar: కరీంనగర్ రేకుర్తి చెరువు అభివృద్ధి పనులకు కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 21 April 2026 3:38 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. కేంద్ర మంత్రి

Karimnagar: నగరంలోని రేకుర్తి లో గల చెరువుకు పునర్జీవన పథకం కింద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ అందరి సహకారంతో అభివృద్ధి పనులు చేస్తూ నగరాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అమృత 2.0 పథకం కింద చెరువులకు మరమ్మత్తులు అభివృద్ధి చేస్తూ పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దుతామన్నారు.

ఆరేపల్లి లో గల మాలకుంట, కొత్తపెళ్లి చెరువు, రేకుర్తి చెరువులకు పునర్జీవన పథకం కింద ఐదు కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అందరి సహకారంతో నగరం అభివృద్ధి చెందుతుందని, రాజకీయాలకతీతంగా అందరూ అభివృద్ధి పనులలో భాగస్వామ్యం కావాలని కోరారు.

అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని, విలీన గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి నిరోధకులను ఎప్పుడు ప్రజలు తిరస్కరిస్తారని, అందుకే ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోరుకోవాలని రాజకీయాలకతీతంగా పనులు చేపట్టాలని అందరం కలిసి పనిచేసే నగర అభివృద్ధికి సహకరిస్తామని కోరారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ తో పాటు నగర మేయర్, డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్, బిజెపి కార్పొరేటర్లు ప్రజలు అధికారులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story