Karimnagar: రూ.79 లక్షలతో అభివృద్ధి పనులకు బండి సంజయ్ శంకుస్థాపన!

Karimnagar: కరీంనగర్ 50వ డివిజన్‌లో రూ. 79.20 లక్షలతో డ్రైన్, కల్వర్ట్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 10 Nov 2026 1:51 PM IST
Karimnagar
X

Karimnagar: రూ.79 లక్షలతో అభివృద్ధి పనులకు బండి సంజయ్ శంకుస్థాపన!

Karimnagar: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివ్రుద్ధి చేసే పూచీ నాది. కేంద్ర, రాష్ట్రాల సహకారంతో అభివ్రుద్ధి చేస్తున్నా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సహకారంతో కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు తెస్తున్నా. అండగా నిలిచి మరింత ఆదరించండి’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఝప్తి చేశారు.

ఈ నేపథ్యంలో ‘‘సర్’’ పేరిట రాజ్యాంగ సంస్థలపై విపక్షాలు చేస్తున్న దాడిని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఈనెల 18న కరీంనగర్ వస్తున్నారని, ఆరోజు నిర్వహించే మహాపాదయాత్రకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఒక్కరూ హాజరై మద్దతు తెలపాలని కోరారు.

ఈరోజు 50 వ డివిజన్ లోని జ్యోతినగర్ ఎక్స్‌ప్లోరికా స్కూల్ సమీపంలో రూ. 79.20 లక్షల మునిసిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న ఆర్.సి.సి. డ్రైన్, స్లాబ్ కల్వర్ట్ నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా స్థానికులతో కాసేపు ముచ్చటించారు. ‘‘కరీంనగర్ పార్లమెంట్ ను అన్ని విధాలా అభివ్రుద్ధి చేసే పూచీ నాది. మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్ సహకారంతో కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు తెస్తున్నా. అభివ్రుద్ధి పనులు చేస్తున్నా. ఈనెల 18న నితిన్ నబిన్ తొలిసారి కరీంనగర్ కు వస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘‘మహా పాదయాత్ర’’కు కరీంనగర్ పార్లమెంట్ నుండి ప్రతి ఒక్కరూ హాజరై సంఘీభావం తెలిపండి.’’అని కోరారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR