Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శమీ పూజ నిర్వహించిన బండి సంజయ్!

Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శమీ పూజలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 20 Oct 2026 1:47 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శమీ పూజ నిర్వహించిన బండి సంజయ్!

Karimnagar: నగరంలోని మహాశక్తి ఆలయంలో షమీ పూజ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్. అనంతరం బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ హిందు బంధువులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నా అని అన్నారు.

వానల్లేక ఇబ్బందులు పడుతున్న రైతాంగం బాధలు తొలగిపోవాలి, ఉద్యోగ, ఉపాధి లేక అల్లాడుతున్న నిరుద్యోగులకు భరోసా కల్పించాలి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ప్రయోజనాలు కాపాడాలి, శక్తివంతమైన సమాజం నిర్మితమయ్యేలా అందరికీ శక్తి కల్పించాలని అమ్మవారిని కోరుకున్నాట్లు చెప్పారు. సమాజానికి ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ సేవలందించాలని దేశాన్ని సైనికుడిలా రక్షిస్తున్న మోదీకి ఇబ్బందులన్నీ తొలగిపోవాలని కోరుకున్నట్లు చెప్పారు.

దేవీ నవరాత్రుల్లో భవానీ దీక్షలు చేపట్టే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది, చిన్న పిల్లల దగ్గరనుండి వ్రుద్దుల వరకు వేలాది మంది దీక్షలు తీసుకోవడం శుభ పరిణామం అన్నారు. కరీంనగర్ మహాశక్తి ఆలయానికి దేవీ రాత్రి ఉత్సవాలకు వేలాది మంది హాజరయ్యారు.

ధార్మిక వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి అని తెలిపారు. విజయదశమి వేల ప్రజలందరికీ విజయాలు చేకూరాలని మనస్పూర్తిగా కోరుకున్నట్లు, దేవి అందరికీ శుభాలు అందించాలని కోరినట్లు తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN