Karimnagar: కరీంనగర్లో రణరంగం బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తల దాడులు..
Karimnagar: కరీంనగర్‌లో రాజకీయ రణరంగం. బండి సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ.
Karimnagar: కరీంనగర్లో రణరంగం బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తల దాడులు..
కరీంనగర్: బండి సంజయ్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వాక్యాలకు నిరసనగా బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్న కౌశిక్ రెడ్డి పై దాడికి దిగారు. ఈ సమయంలో క్యాంపు కార్యాలయంలో ఉన్న రెడ్డి తలుపులు పెట్టుకోవడంతో బయట ఉన్న ఆయన వాహనంపై కర్రలతో దాడి చేసిన బిజెపి నాయకులు, కార్యకర్తలు. పోలీసులు వారించిన కూడా వినకుండా దాడికి పాల్పడ్డ బిజెపి శ్రేణులు. పోలీసులు బలవంతంగా బిజెపి కార్యకర్తలు అడ్డుకొని అరెస్టు చేసి తరలించారు. గొడవ సద్దుమణిగిన సమయంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యాలయం పై దాడికి చేయడానికి బయలుదేరారు.
బిఆర్ఎస్ కార్యకర్తలపై ఏబీవీపీ దాడి
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడిని నిరసిస్తూ, ఎంపీ సంజయ్ కార్యాలయం పైకి దూసుకెళ్లిన బిఆర్ఎస్ కార్యకర్తలపై అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగారు. కర్రలు రాళ్లతో పోలీసుల ఎదుట శ్రేణులపై దాడి చేస్తుండగా, ఎంపీ కార్యాలయం ఎదుట రచ్చ రచ్చగా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు అడ్డుకోవాల్సింది పోయి చేష్టలుడికి చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కరీంనగర్ ఎమ్మెల్యే ఎంపీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసుల మోహరింపు..
బిజెపి, బీఆర్ఎస్ శ్రేణుల తీరుతో కరీంనగర్ లో రణరంగ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ఎమ్మెల్యే ఎంపీ క్యాంపు కార్యాలయాల ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు చోట్ల పోలీసులను మోహరించారు. ఆయా కార్యాలయాల పరిసరాల్లోకి ఎవరిని వెల్లనీయకుండా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.




