Karimnagar: ఆర్టీసీ సమస్యలు పరిష్కరించే వరకు వదిలేది లేదు.. బండి సంజయ్!
Karimnagar: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Karimnagar: ఆర్టీసీ సమస్యలు పరిష్కరించే వరకు వదిలేది లేదు.. బండి సంజయ్!
కరీంనగర్: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు కార్మికులకు అండగా బిజెపి పోరాడుతుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం చేస్తుందని, కార్మికులకు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులు ఎవరిదో ఆత్మహత్యలు చేసుకోవద్దని వారికి అండగా బిజెపి పోరాటం చేస్తుందని తెలిపారు.
అధికారంలోకి వచ్చే ముందు భగవద్గీత, కురాన్, బైబిల్ అని ప్రకటించిన కాంగ్రెస్ మేనిఫెస్టో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం విలీన ప్రక్రియను ఎందుకు మొదలు పెట్టలేదని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివి వినిపించి కార్మికులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని, మీరు చనిపోతే మీ కుటుంబాలు వీధిపాలవుతాయని బ్రతికుండీ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారిని చర్చలకు ఆహ్వానించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.




